Breaking News

ఆమ‌ర‌ణ దీక్ష‌కు హార్దీక్ సిద్ధం..

  • త‌న నివాసం వ‌ద్ద దీక్ష‌కు ఏర్పాట్లు.. 
  • అహ్మాదాబాద్ లో  144 సెక్ష‌న్ అమ‌లు.. 

అహ్మాదాబాద్‌: పాటీదార్ల ఉద్య‌మ నేత హ‌ర్దిక్ ప‌టేల్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు సిద్ధం కానున్నారు. శ‌నివారం ఆయ‌న త‌న నివాసం వ‌ద్ద‌ దీక్ష చేయనున్నారు. కానీ, ఇప్ప‌టికే అధికార యంత్రాంగం అమ‌ర‌ణ దీక్ష‌కు అనుమ‌తి నిరాక‌రించింది. అందులోనూ అహ్మాదాబాద్‌లో 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో హార్దిక్ దీక్ష చేసేందుకు సిద్ధం కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంది. అహ్మాదాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఈ నెల 19న హార్దిక్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

అనంత‌రం ఆయ‌న ముంద‌స్తు బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చారు. దాంతో ప్ర‌భుత్వం హ‌ర్దీక్ బెయిల్‌ను కొట్టివేయాలంటూ సెష‌న్స్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై సోమ‌వారం కోర్టు తీర్పు వెలువ‌డే అవ‌కాశం ఉంది. గుజ‌రాత్ లోని పటీదార్ల రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు ఉద్యోగాలు, ఉన్న‌త విద్య సంస్థ‌ల అభివృద్ధి కోసం మూడేళ్లగా హార్దీక్ పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. 

2 comments: