Breaking News

శాంసంగ్ గెలాక్సీ 9 వ‌చ్చేసిందోచ్‌..

స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌. శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 ఎట్టకేలకు వచ్చేసింది. ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ దిగ్గ‌జం శామ్‌సంగ్ ఈ కొత్త మోడ‌ల్‌ను ప్ర‌పంచవ్యాప్తంగా విడుదల చేసింది . ఇప్పటివరకు ఉన్న నోట్‌ సిరీస్‌ మోడళ్ల కంటే పెద్దప‌రిమాణంలో బ్యాటరీ, అతిపెద్ద డిస్‌ప్లే ఈ నోట్‌ 9 ప్రత్యేకత. ఈ ఫోన్‌ మొత్తం 1 టెరాబైట్‌ అంతర్గత మెమొరీని సపోర్ట్ చేస్తుంది. నోట్‌ 9లో 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు మెమొరీ కార్డు , మరో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవ‌చ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ కాపర్‌, ఓషియన్‌ బ్లూ, లావెండర్‌ పర్పుల్‌ రంగుల్లో నోట్‌ 9ను తయారుచేశారు. ఈ కలర్లకు మ్యాచ్‌ అయ్యే రంగుల్లోనే ఎస్‌ పెన్‌(స్టైలస్‌) కూడా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ 9 వ‌చ్చేసిందోచ్‌..

అమెరికా మార్కెట్లో నోట్ 9 ఫోన్‌.. ప్రారంభ ధర 999 డాలర్లుగా ఉంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 999డాలర్లు (ఇండియ‌న్‌ కరెన్సీలో దాదాపు రూ. 68,700), 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,250డాలర్లు (రూ. 85,900)గా ఉంది. అమెరికాలో శుక్ర‌వారం నుంచి ఈ ఫోన్‌ ప్రీఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుద‌ల చేస్తార‌నే దానిపై శామ్‌సంగ్‌ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. భారత్‌లో శామ్‌సంగ్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా త్వరలోనే విడుదల చేసే అవకాశాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

No comments